ఇరాన్ కు బాసటగా ఈయూ,ఇరాన్,చైనా,రష్యాలు!

వాస్తవం ప్రతినిధి: ఇరాన్ కు బాసటగా యూరోపియన్ యూనియన్, చైనా, రష్యాలు నిలిచాయి. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను చిక్కుల్లో పడేయడానికి, 2015నాటి అణు ఒప్పందంపై తిరిగి చర్చలు జరిపేలా ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఏకపక్షంగా విధిస్తున్న ఆంక్షలను నివారించేలా ఆ దేశాలు ఒక ప్రణాళిక ను రూపొందించనున్నాయి. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పివి)గా పేర్కొంటున్న ఈ ప్రతిపా దిత చర్య ఇరాన్‌కు సహాయపడుతుందని ఇయు దౌత్యవేత్తలు ఆశిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇక్కడకు వచ్చిన ఇయు విదేశాంగ వ్యవహారాల చీఫ్‌ ఫెడెరికా మొగెరిని మాట్లాడుతూ, చమురుతో సహా ఇరాన్‌ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన చెల్లింపులకు వీలు కల్పించేలా ఎస్‌పివిని రూపొందించామన్నారు.