కిమ్ పై ప్రసంశలు కురిపించిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: ఒకప్పుడు ఉప్పు నిప్పుగా ఉన్న అమెరికా,ఉత్తర కొరియా దేశాల అధ్యక్షులు  ఇప్పుడు స్నేహ గీతాలు పాడుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం వీలైనప్పుడల్లా ఇద్దరు ఒకరిపై మరొకరు ప్రశంసల జల్లు కురిపించుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే గతేడాది ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా కిమ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ట్రంప్‌.. ఇప్పుడు అదే వేదికగా ప్రశంసలు కురిపించడం విశేషం.  ఐరాస సమావేశాల్లో ట్రంప్‌ ప్రసంగిస్తూ కిమ్‌ను తెగ పొగిడేశారు. ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ శాంతిని కోరుకుంటున్నారు. అందుకోసం ఆయన ఎంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు’ అంటూ ట్రంప్‌ ప్రసంశలు కురిపించారు. కానీ ఉ.కొరియాపై విధించిన ఆంక్షలు మాత్రం కొంతకాలం పాటు కొనసాగుతాయని తెలిపారు.