యోయో టెస్ట్ కు వెళ్లనున్న విరాట్ కోహ్లీ

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం ఆసియా కప్ కు దూరంగా రెస్ట్ మోడ్ లో ఉన్న టీమిండియా సారధి విరాట్ కోహ్లీ మరోసారి యోయో టెస్ట్ కు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ యో-యో టెస్టుకు వెళ్లనున్నాడు. ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి సెప్టెంబరు 28న యో-యో టెస్టుకు హాజరవనున్నాడని సమాచారం. ఈ ఏడాది ఫిట్‌నెస్‌కి సంబంధించి కోహ్లీ ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆసియాకప్‌కు దూరమవ్వడానికి ఇది కూడా ఒక కారణం. దీంతో యో-యో టెస్టుకు హాజరవ్వాల్సిందిగా సెలెక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో కోహ్లీ యోయో టెస్ట్ కు హాజరు కానున్నట్లు తెలుస్తుంది.