ఇంకొన్ని గంటల్లో “బిగ్‌బాస్ షోలో ఏదైనా జరగొచ్చు”

వాస్తవం సినిమా : మరో మూడు రోజుల్లో టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 2 ముగియనున్న నేపథ్యంలో “బిగ్‌బాస్ షోలో ఏదైనా జరగొచ్చు” అనే నాని మాటలు నేడు నిజం కానున్నాయట. ఫైనల్ నలుగురి మధ్యే జరపాలని నిర్ణయించుకున్న బిగ్ బాస్, నేడు ఒకరిని ఎలిమినేట్ చేయనున్నారని, ఎలిమినేట్ అయ్యేది నటి, యాంకర్ దీప్తి నల్లమోతని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. నేడు ప్రసారం అయ్యే ఎపిసోడ్ లోనే దీప్తి ఎలిమినేషన్ అవుతుందని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ కామెంట్లు ఎంతవరకూ నిజమో తెలియాలంటే, ఇంకొన్ని గంటలు వేచి చూడక తప్పదు. కాగా, దీప్తిని బయటకు పంపించాలని కౌశల్ ఆర్మీ ఫేక్ ఓట్లను వేస్తోందని పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే.