సామ్ ..పెళ్లయ్యాక ఇలాంటివి అవసరమా ?

వాస్తవం సినిమా: సమంత తాజాగా పోస్ట్ చేసిన ఒక పొటోతో నెటిజన్ ల ఆగ్రహానికి గురైంది. ‘యూటర్న్‌’ చిత్రం విడుదలైన తర్వాత ప్రస్తుతం విదేశాల్లో చైతుతో హాలిడే సీజన్ ని ఎంజాయ్ చేస్తున్న సామ్ అక్కడ తాను ఆస్వాదిస్తున్న క్షణాలను ఫోటోల రూపంలో పోస్ట్ చేస్తోంది. చైతూ తో బికినీలో ఎంజాయ్‌ చేస్తున్న సాం ఎంజాయ్‌ చేయడం వరకు ఆగకుండా ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో విమర్శలు వస్తున్నాయి.

ఆ డ్రెస్ అసలు నప్పలేదని కొందరు, పెళ్లయ్యాక ఇలాంటివి అవసరమా అని మరికొందరు ఎవరికి తోచినట్టు వారు అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేయటం మొదలుపెట్టారు. అలా అని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేక కాదు. మరోవైపు తను ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెప్పే హక్కు మనకెక్కడిదని , సమంత పిక్‌కు ఫిదా అవుతున్నారు. సమంత పెళ్లి అయిన తర్వాత కూడా ఇంత గ్లామర్‌గా, ఇంత బోల్డ్‌గా కనిపించడం అభినందనీయం అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.
గతంలో ఇలాంటి ఫోటోని పోస్ట్ చేసినప్పుడు వచ్చిన కామెంట్స్ కు స్పందించిన సమంతా పెళ్లయ్యాక ఎలా ఉండాలో నిర్దేశించే పద్ధతికి స్వస్తి పలకాలని ఇంతకు ముందే చెప్పింది. ఇప్పుడైనా అదే సమాధానమే వచ్చే అవకాశం ఉంది.