ప్రభాస్ పెళ్లి డేట్ ఫిక్స్ చేసేశారుగా..ఎప్పుడంటే..??

వాస్తవం సినిమా: బాహుబలితో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ఈశ్వర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ సాహో వరకూ చేసినా సినిమాలు అన్ని ఎంతో వైవిధ్యభరితంగా ఉంటాయి..అయితే తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోలు కాని లేదా తన ఈడు స్నేహితులు కాని ఇప్పటికే పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలని కూడా కనేస్తుంటే ప్రభాస్ మాత్రం ఈ విషయంలో ఎంతో వెనుకపడ్డాడు..అయితే

ఎప్పటికప్పుడు ప్రభాస్ పెళ్లి విషయంలో ఎన్నో సంచలన కధనాలు వచ్చాయి అనుష్క తో ప్రభాస్ పెళ్లి అన్నారు వేరే వేరే అమ్మాయిల పేర్లు సైతం తెరపైకి వచ్చాయి అయితే..ఇప్పటివరకూ ఈ విషయంలో ఎవరికీ ఒక క్లారిటీ లేదు..దాంతో ప్రభాస్ పెళ్లి విషయంలో తర్జన భర్జనలు జరుగుతూ వచ్చాయి..

అయితే 39 ఏళ్ళు వచ్చిన ప్రభాస్ పెళ్లి మాట ఎత్తుతుంటే అప్పుడే పెళ్లి ఎందుకు అంటున్నాడట..ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులే కాదు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు…తాజాగా ప్రభాస్ పెళ్లిఫై అసలు సిసలైన క్లారిటీ రాబోతుందట. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి ఆయన కుంటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు…అదే రోజుని పురస్కరించుకుని ప్రభాస్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తారట.దాంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సంబరంగా ఉన్నారు.