రేవంత్ పై పెట్టిన కేసులు ఇవే..చిప్పకూడు తప్పదా..!!!

వాస్తవం ప్రతినిధి:  తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బలంగా బిగుస్తోంది. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందనినేను ఏ క్షణమైనా జైలుకు వెళ్లడం ఖాయమనిఅక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆయన ఆస్తులపై ఈడీ అధికారులు దాడి చేయడం సంచలనం రేపుతోంది. షెల్ కంపెనీల ద్వారా విదేశీ నిధులను తనతో పాటు తన కుటుంబసభ్యుల పేర్లపై  రేవంత్ రెడ్డి మార్చాడనే ఆరోపణలు  ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఐటీ అధికారులు గురువారం నాడు రేవంత్ తో పాటు ఆయన కుటుంబసభ్యులుబంధువుల ఇళ్లపై సోదాలు నిర్వహించారు.

అమెరికాదుబాయ్మలేషియాల నుండి పెద్ద ఎత్తున నిధులను  రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు వచ్చి చేరిందని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నట్టు ప్రచారంలో ఉంది.2014లో రేవంత్‌కు ఒకే రోజు రూ 9 కోట్లు  వచ్చిన విషయాన్ని ఐటీ అధికారులకు కంప్లైంట్ చేశారు. రామారావు అనే న్యాయవాది ఐటీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.ఈ ఫిర్యాదు ఆధారంగా  ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

 ఎన్నికల సందర్భంగా 2009 నుండి దాఖలు చేసిన అఫిడవిట్లో రేవంత్ తన ఆస్తులను రూ.3.6 కోట్లు ఉందని  పేర్కొన్నాడు.2014 నాడు ఎన్నికల అఫిడవిట్ ‌లో తన ఆస్తులను రూ.13.12 కోట్లుగా చూపారు. అయితే ఐదేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి రూ.10 కోట్లను ఎలా సంపాదించారని  ఫిర్యాదుదారుడు రేవంత్‌ గురించి ప్రశ్నించారని సమాచారం.అయితే  రేవంత్ తన ఆదాయాన్ని ఏడాదికి రూ.5లక్షలుగా పేర్కొన్న విషయాన్ని కూడ ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.  ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భారీగా  ఆస్తులను  రేవంత్ రెడ్డి కూడబెట్టారని ఈడీ,  ఐటీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో పాటు  ఆయన అల్లుడు,వియ్యంకుడిపై కూడ  ఆరోపణలు వచ్చాయి. రేవంత్ రెడ్డి వియ్యకుండుకు చెందిన సంస్థ అక్రమాలకు కేంద్రంగా ఉందనే ఆరోపణలు  ఉన్నాయి. బ్యాంకులను మోసం చేసి రూ.65 కోట్లు,  వ్యవసాయ రుణాల పేరుతో రూ.75 కోట్లు కొల్లగొట్టాడని ఫిర్యాదు దారుడు ఐటీకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది….ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, బ్లాక్ మనీ ఇంకంటాక్స్ 2015,  ప్రోహిబిషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్1988, ప్రోహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ 1988  చట్టాల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.  షెల్ కంపెనీల ద్వారా కోట్లాది రూపాయాలను రేవంత్ రెడ్డి  కుటుంబసభ్యులు పొందారని  ఆ న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.