స్వల్ప అస్వస్థతకు గురైన స్టాలిన్

వాస్తవం ప్రతినిధి: డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గత రాత్రి స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చిన్న శస్త్రచికిత్స చేశామని, కుడి తొడలో సమస్యగా మారిన తిత్తిని తొలగించామని వైద్యులు ఈ ఉదయం వెల్లడించారు. గత కొంతకాలంగా నడవటంలో స్టాలిన్ ఇబ్బందులు పడుతుండగా, నిన్న ఒక్కసారిగా బాధ అధికం కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. స్టాలిన్ ను ఈ మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని అపోలో ఆసుపత్రి వైద్య బృందాలు వెల్లడించాయి.