ఆధార్ పై సుప్రీం ఇచ్చిన తీర్పు పై స్పందించిన జైట్లీ

వాస్తవం ప్రతినిధి: ఆధార్‌ విషయంలో నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఆ తీర్పు చరిత్రాత్మకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఆధార్‌ విధానాన్ని న్యాయ పరిశీలన అనంతరం కోర్టు అంగీకరించిందని, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని జైట్లీ తెలిపారు. ఆధార్‌ రాజ్యాంగబద్ధమే అని కోర్టు ఈరోజు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ తప్పనిసరి కాదని స్పష్టంచేసింది. కాగా కోర్టు తీర్పుపై కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌ హర్షం వ్యక్తంచేశారు. ఆధార్‌ను విమర్శించిన వారంతా సాంకేతికతను తిరస్కరించకూడదని జైట్లీ సూచించారు. మార్పులను అంగీకరించాలని కోరారు.