శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

వాస్తవం ప్రతినిధి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నమయ్య భవన్ లో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా అక్టోబర్ 10 నుంచి 18వ తేది వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
దసరా సెలవులు, తమిళులకు ముఖ్యమైన పెరటాశి నెల సందర్భంగా స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. దీనిలో భాగంగా ఈనెల 29, 30, అక్టోబర్ 6, 7, 13, 14, 20, 21 వ తేదిల్లో ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. ఈనెల 29, అక్టోబర్ 6, 13, 20 తేదిల్లో దివ్యదర్శనం టోకెన్లు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.