ఊపిరి అందక విమానంలోనే మృతి చెందిన 11 నెలల చిన్నారి

వాస్తవం ప్రతినిధి: విమానంలో ఒక చిన్నారి ఊపిరి అందక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది, అర్నవ్ వర్మ అనే 11 నెలల బాను తన తల్లి దండ్రుల తో కలిసి ఖతార్ ఎయిర్ వేస్ విమానంలో ఖతార్ లోని దోహా నుంచి హైదరాబాద్ వస్తున్నాడు. అయితే అతనికి విమానంలో శ్వాస సంబంధిత సమస్య రావడం తో దీంతో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవ్వగానే వెంటనే చిన్నారిని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అపోలో మెడికల్ సెంటర్‌కు తరలించినట్లు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ వెల్లడించింది. అయితే బాబు అప్పటికే చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించినట్లు తెలుస్తుంది. అయితే మృతి చెందిన ఆర్నవ్‌ వర్మకు అమెరికా పాస్‌పోర్ట్‌ ఉండగా, బాబు తండ్రి అనిల్‌ వర్మకు భారత పాస్‌పోర్ట్‌ ఉంది. వారు ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఎస్‌ఆర్‌-500లో హైదరాబాద్‌కు వచ్చారు. అయితే ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.