నా పదహారో యేట అత్యాచారానికి గురయ్యాను

వాస్తవం ప్రతినిధి: నేను నా పదాహారో యేట అత్యాచారానికి గురయ్యాను అని ప్రవాస భారతీయ అమెరికా టీవీ యాంకర్ పద్మా లక్ష్మీ తెలిపారు. అయితే నా పై ఈ అఘాయిత్యం చేసింది ఎవరో బయటి వారు కాదు. నాకు బాగా తెలిసిన వ్యక్తి.. నేను బాగా నమ్మిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడు. కానీ ఇంత వరకూ ఈ విషయాన్ని కనీసం మా అమ్మతో కూడా చెప్పుకోలేదు.. అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాల్ని వెల్లడించారు ప్రముఖ భారతీయ – అమెరికా టీవీ యాంకర్‌ పద్మాలక్ష్మి. బాల్యం నుంచి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు.. వాటి పర్యవాసనాలు.. ఇన్నేళ్లు వాటి గురించి మాట్లాడకపోవడానికి గల కారణాలను న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో చెప్పుకొచ్చారు. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు.. ఓ 23 ఏళ్ల యువకుడితో డేటింగ్‌ చేసాను. మా బంధం ప్రారంభమయ్యి కొన్ని నెలలు కూడా గడవకముందే అతడు నా మీద అత్యాచారం చేశాడు. అంటే ఒక పురుషుడు.. కేవలం తన లైంగిక అవసరాలు తీర్చుకోవడం కోసమే స్త్రీతో బంధాన్ని కోరుకుంటాడా.. తనను నమ్మి వచ్చిన స్త్రీని ఓ బానిసగా చూస్తాడా.. ఆమె ఇష్టాఇష్టాలతో పని లేదా అనిపించింది. ఆ సమయంలో నాకు నేనే చాలా బలహీనురాలిగా తోచాను. నాపై అత్యాచారం జరిగిందనే విషయం గురించి కనీసం మా అమ్మతో కూడా చెప్పుకోలేక పోయాను’ అంటూ అందుకు గల కారణాన్ని వివరించారు.