రివ్యూ అడిగిన రాహుల్ పై నెటిజన్ల విమర్శలు

వాస్తవం ప్రతినిధి: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా మంగళవారం భారత్‌-ఆఫ్గానిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరికి మాత్రం ఈ మ్యాచ్‌ టైగా నిలిచింది. అయితే ఆ మ్యాచ్ సంగతి వదిలేసిన క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఒక్క విషయం పైనే తమ దృష్టి పెట్టారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్‌.. ధాటిగా ఆడుతున్న సమయంలో రషీద్‌ ఖాన్‌ వేసిన 21వ ఓవర్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే దీనిపై సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాహుల్‌ నిర్ణయంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ రివ్యూ అడక్కుండా ఉండాల్సింది అంటూ పెద్ద ఎత్తున ట్విటర్ వేదికగా కామెంట్లు పెడుతున్నారు. రివ్యూ ద్వారా టైం వేస్ట్‌ చేసే ఆటగాళ్లలో ఇప్పుడు రాహుల్‌ కూడా చేరిపోయాడు, లెజెండ్లు తమని తాము కాపాడుకోవడానికి రివ్యూలు అడుగుతారు. అల్ట్రా లెజెండ్లు ఔటవ్వడానికి రివ్యూలు అడుగుతారు,రాహుల్‌ డీఆర్‌ఎస్‌ అడక్కుండా ఉంటే ధోనీ ఔటయ్యేవాడు కాదేమో?. అప్పుడు మ్యాచ్‌ ఫలితం వేరేలా ఉండేది. రాహుల్‌కి నమ్మకం లేకనే రివ్యూ అడిగాడు. దానివల్ల ఒరిగిందేమీ లేదు. ఆటగాళ్లు పరిస్థితిని బట్టి రివ్యూలు అడిగితే మంచిది, రాహుల్‌ నువ్వేమన్నా ధోనీ అనుకుంటున్నావా? రివ్యూలు అడగటానికి, ఫైనల్లో ఇలాంటి వాటికి దూరంగా ఉండండి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.