తన హాట్ ఫొటో షేర్ చేసుకున్న సమంత… 4 గంటల్లో 5 లక్షల లైక్స్!

U Turn Movie Actress Samantha INterview Images

వాస్తవం సినిమా: పెళ్లికి ముందు ఎలాంటి హిట్స్ ఇచ్చిందో.. అక్కినేని నాగచైతన్యతో వివాహం అనంతరం కూడా వరుస హిట్లను సాధిస్తూ మంచి ఊపు మీదున్న సమంత, తాజాగా సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి సునామీనే సృష్టించింది. గ్లామర్ డోస్ ను ఏ మాత్రం తగ్గించడం లేదు. యూటర్న్ మంచి విజయం సాధించడంతో.. సమంత.. నాగ చైతన్యతో కలిసి వెకేషన్ కు వెళ్ళింది. వెకేషన్లో భర్త నాగ చైతన్యతో కలిసి ఎంజాయ్ చేస్తూ.. అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నది. సమంత షేర్ చేసిన ఫోటో ఒకటి కొన్ని క్షణాల్లోనే వైరల్ గా మారింది. ‘మానసిక ప్రశాంతత’ అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటో పోస్టు చేసిన తరువాత కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. పెళ్లయిన తరువాత కూడా గ్లామర్ ను ఒలకబోస్తున్న సమంత షేర్ చేసుకున్న ఫొటో ఇదే.