‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్

వాస్తవం సినిమా: అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్‌ ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తోన్న మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’. ఇప్పటికే ఈ మూవీలో నటించిన నటీనటులకు సంబంధించిన మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేసిన ఈ మూవీ యూనిట్..తాజాగా అమితాబ్, ఆమీర్, కత్రినా, ఫాతిమా సనాషేక్‌లతో కూడిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు.
ఈ మూవీ ట్రైలర్‌ను ఈ గురువారం రిలీజ్ చేయనున్నారు. ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ మూవీ 19 శతాబ్ధం నేపథ్యంలో తెరకెక్కుతోంది. 1839లో ఫిలిప్ మీడోస్ టేలర్ రాసిన ‘కన్ఫెషన్స్ ఆప్ ఎ థగ్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ రాజస్థాన్ సంచార తెగలకు సంబంధించిన బందిపోటు దొంగల స్టోరీ. ఈ మూవీకోసం ప్రత్యేకంగా ఒక పడవ సెట్‌ను రూపొందించారు కూడా.