‘చంద్రోదయం’ఫస్ట్ లుక్ రిలీజ్

 వాస్తవం సినిమా :  ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా కొనసాగుతున్న ట్రెండ్ బయోపిక్స్. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ ‘చంద్రోదయం’. పి.వెంకటరమణ దర్శకత్వంలో జీజే రాజేంద్ర నిర్మిస్తున్న ఈ బయోపిక్ ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ ఈరోజు విడుదల చేసింది.

చంద్రబాబునాయుడు ఓ లివింగ్ లెజెండ్ అని, దేశ చరిత్రలో ఆయనొక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడని దర్శకుడు వెంకటరమణ ప్రశంసించారు. ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్య కుటుంబంలో జన్మించి అగ్రస్థానానికి ఎదిగిన చంద్రబాబు జీవితం గురించి అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ‘చంద్రోదయం’ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఈ చిత్రం చిత్రీకరణ చివరిదశలో ఉందని, వినోద్ నువ్వుల చంద్రబాబు పాత్రలో నటిస్తున్నాడని చెప్పారు.