ఓడిశా సీ ఎం తో భేటీ అయిన కమల్

వాస్తవం ప్రతినిధి: ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో నటుడు, మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్‌ హాసన్ బుధవారం భేటీ అయినట్లు తెలుస్తుంది. కమల్‌ హాసన్‌ ఇటీవల రాజకీయారంగేట్రం చేసి మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీ స్థాపన అనంతరం ఆయన తరచూ జాతీయ నేతలను కలుస్తున్నారు. గతంలో ఆయన అరవింద్‌ కేజ్రీవాల్‌, పినరయి విజయన్‌ వంటి పలువురు ప్రతిపక్ష నేతలతో భేటీ అయినట్లు తెలుస్తుంది. చెన్నైలోని ఒడిశా భవన్‌లో ఉన్న సీఎం నవీన్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు భేటీ అనంతరం కమల్ హాసన్ తెలిపారు. అయితే గతంలో పలువురు నేతలను కలిసిన కమల్ ఇప్పుడు తాజాగా ఒడిశా సీఎం నవీన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో జాతీయ, ప్రాంతీయ పార్టీల‌ను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు కమల్ ప్రయత్నిస్తుండటం తమిళ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.