కేంద్ర ఎన్నికల సంఘాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు

వాస్తవం ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఏడు ముంపు మండలాలను ఎపిలో కలపడంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించినట్లు తెలుస్తుంది. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఎపిలో కలపడం వల్ల… తెలంగాణ భూభాగంతో పాటు ఓటర్లను కూడా తాము నష్టపోతామని పిటీషనర్ పిటీషన్ లో దాఖలు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ముంపు మండలాలను ఎపిలో కలపడం రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్ అభిప్రాయపడ్డారు. దీనితో ఈ పిటిషన్‌ ను విచారించిన హైకోర్టు… కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.