“మావో” ల హిట్ లిస్టులో…పెద్ద తలకాయలు..లిస్ట్ ఇదే

వాస్తవం ప్రతినిధి: మావోల ఉనికి కోల్పోయారు అంతా సద్దుమణిగి పోయింది హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న టీడీపీ నేతలకి మావోల హిట్ లిస్టు లో ఉన్న వారికి వెన్నులో వణుకు పుట్టించింది తాజాగా జరిగిన టీడీపీ ఎమ్మెల్యేల హత్యా కాండ లివిటిపుట్టు ఉదంతంత తో పోలీసులు అలెర్ట్ అయ్యారు మావోల హిట్ లిస్టు లో ఉన్న వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు..ఎలాంటి సంఘటనలు అయినా జరగచ్చు కావున జాగ్రత్తగా ఉండండి అంటూ పోలీసులు సదరు నేతలని హెచ్చరించారు..

మావోల హిట్ లిస్టు లో దాదాపుగా  200 మంది నేతలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు..ఈ లిస్టు లో అధికార పార్టీకి చెందిన నేతలతో పాటు మాజీ నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారట..మావోలు చాప కింద నీరులా తమ బలాన్ని పెంచుకుంటూ పోయిన వైనం ఇప్పుడు కొత్త భయాలకు తెర తీస్తోంది. మొన్నటివరకూ మావోల పేరుతో వచ్చే హెచ్చరికల్ని పెద్దగా పట్టించుకోని నేతలంతా ఇప్పుడు మాత్రం ఫుల్ అలెర్ట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది...మావోల హిట్ లిస్టు లో మాపేర్లు ఉన్నాయా అంటూ పోలీసులని కొంతమంది నేతలు కలవడం గమనార్హం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మావోల హిట్ లిస్ట్ లో ఉన్నవారి పేర్లని ఒకసారి పరిశీలిస్తే..ముఖ్యంగా విశాఖ జిల్లాకి చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు పేరు వినిపిస్తోందట ఆయనతో పాటు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేరు కూడా వినిపిస్తోందని అంటున్నారు..హిట్ లిస్టు వివరాలు ఒక సారి పరిశీలిస్తే..

–      విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు

–      పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

–      అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు

–      మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు

–      బాలరాజు సోదరుడు వినాయక్

–      గిడ్డి ఈశ్వరి వ్యక్తిగత కార్యదర్శి పోలుపర్తి గోవింరావు

–      బీజేపీ నాయకుడు లోకుల గాంధీ

–      కొయ్యూరు మండలం బూదరాళ్ల మాజీ సర్పంచ్ సూరిబాబు

–       కొయ్యూరు మండలం టీడీపీ నేత ఎం. ప్రసాద్

–       పెద బయలు మండలాధ్యక్షుడు  ఉమామహేశ్వరరావు

–      మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ

–      పెద బయలు మండలం జామిగూడ మాజీ సర్పంచ్ సుబ్బారావు

–      ఇంజిరి మాజీ సర్పంచ్ సత్యారావు

–      ఇంజిరి మాజీ సర్పంచ్ కామేశ్వరరావు

అయితే వీరు మాత్రమే కాకుండా వీరితో పాటుగా చింతపల్లి మండలంలో 12 మంది.. జీకే వీధి మండలంలో మందికి మావోలు హెచ్చరికలు జారీ చేశారట..ఈ క్రమంలో బయటకి వెళ్ళాలంటే వారందరూ తీవ్రమైన ఆందోళనలకి లోనవుతున్నారని తెలుస్తోంది..ఎక్కడికి వెళ్ళినా ముందుగా చెప్పి వెళ్లాలని డేంజర్ జోన్స్ ఆయా లిస్టు లో ఉన్న వారికి చెప్పమని పోలీసు అధికారులు తెలిపారు.