“సొంత జిల్లా ” ఎంట్రీ తో దూకుడు పెంచిన…“జనసేనాని”..!!! 

వాస్తవం ప్రతినిధి: సొంత ఊరిలో ఉన్నంత బలం మనం ఎక్కడికి వెళ్ళినా రాదు..ఎంతన్నా సొంత ఊళ్లలో ఆ కిక్కే వేరబ్బా..ఏంటి సినిమా డైలాగ్ అనుకుంటున్నారా కాదండీ నిజమే ఎవరికి వారు ఒక్క సారి తమ సొంత ఊరికి వెళ్తే ఎంత ధృడంగా ఎంతో గంభీరంగా ఉంటామో ఒక్కసారి ఊహించుకోండి…అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సొంత జిల్లాలోకి అడుగు పెట్టగానే మునుపటికంటే ఎంతో ఉశ్చాహంగా కనిపించారు…పశ్చిమలో మలివిడత యాత్ర సందర్భంగా పవన్ చేపట్టిన ఈ యాత్ర మెట్టప్రాంతాలలో ఉన్న ప్రజల కష్టాలని తెలుసుకుంటూ..ముందుకు సాగుతుంది అయితే..

తన ప్రజా పోరాట యాత్రను కొనసాగించేందుకు ఏలూరుకు చేరుకున్న ఆయన మంగళవారం వివిధ సంఘాలతో నేతలతో  సమావేశమయ్యారు. పదిరోజులపాటు ఇక్కడే మకాం వేయనున్న పవన్ మంగళవారం రికార్డ్ క్రియేట్ చేశారు ఏకంగా ఒక్కరోజులోనే  “ఏడు సంఘాల” ప్రతినిథులతో సమావేశమయ్యారు. ఇలా రోజువారీ ఈ భేటీలు కొనసాగిస్తూనే నిర్దేశించిన నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు హాజరుకావాలని ఆయన నిర్ణయించారు..ఒక్క రోజులో ఏడూ సంఘాలతో సమావేశాలు అంటే మాటలు కాదు ఇప్పటి వరకూ ఏ నేత కూడా ఒక్కరోజులో ఇన్ని సమావేశాలు నిర్వహించలేదట..ఇది మాత్రం రికార్డ్ బ్రేక్ అంటున్నారు.


ఇదిలాఉంటే జనసేన అధినేత అభిమానులు కార్యకర్తలతో మాట్లాడుతూ  జనసేన సిద్ధాంతాలను, ఆశయాలని గ్రామ గ్రామలకి చేరేలా అభిమానులు కృషి చేయాలని అందరికీ తెలిసేలా వివరించాలని క్షేత్ర స్థాయిలో మరింతగా బలపడాలి అంటే కేవలం ఒకే ఒక్కరి వల్ల సాధ్యం అది నా అభిమానులకి మాత్రమే సాధ్యం అంటూ అభిమానులని ఉద్దేశించి మాట్లాడారు.. జన సైనికుల మీద నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది” అని అన్నారు. పవన్ కళ్యాణ్ అంతకుముందు ప్రజాపోరాట యాత్రలో భీమవరం కేంద్రంగా చేసుకుని..పార్టీ వ్యవహారాలను, భేటీలను ఎలా కొనసాగించగా…ఇప్పుడ ఈ విడతలోనూ అదే తరహాలో యాత్ర కొనసాగించబోతున్నారని తెలిసింది.

అయితే జిల్లా నాయకులకి పవన్ కొన్ని సూచనలు కూడా చేశారట వీలైనన్ని ఎక్కువ భేటీలు ఉండేలా చూడమని తెలిపారట..ఎక్కువమందితో కలిసేలా ఉంటే పశ్చిమలో జనసేన మరింత ఊపందుకుంటుందని చెప్పారట పవన్..అందులో భాగంగానే ఒక్క మంగళవారం రోజునే  ఆయన ఏడు వర్గాలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఆటోడ్రైవర్స్‌ అసోసియేషన్‌,డ్రైవర్ల అసోసియేషన్‌..పాస్టర్ల బృందం..ఆలిండియా దళిత రైట్‌ ఫెడరేషన్‌ సభ్యులతో హమాలీలు..రెల్లి సంక్షేమ సంఘం..శారీరక వికలాంగులు..ఇలా ఏడుగురు సంఘ నాయకులతో ఆయా ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలని తెలుసుకున్నారు..ఈ జోరు చూస్తుంటే పశ్చిమలో పవన్ తప్పకుండా రికార్డ్ స్థాయిలో స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.