రజనీకాంత్ పార్టీ ప్రారంభం.. డిసెంబరులో

వాస్తవం ప్రతినిధి: తమిళనాడు రాజకీయాల్లోకి మరో పార్టీ వచ్చేస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబరులో పార్టీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు రజనీకాంత్ సన్నిహితుడైన పుదియనీతి కట్చి వ్యవస్థాపకుడు ఏసీ షణ్ముగం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబరులో రజనీకాంత్ పార్టీని ప్రారంభిస్తారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. తాము కూడా రజనీకాంత్‌తోనే సాగుతామని ఆయన స్పష్టం చేశారు. కాగా, మరో సూపర్ స్టార్ కమలహాసన్ ఇప్పటికే పార్టీని ప్రారంభించి దూకుడు మీదున్న సంగతి తెలిసిందే.