ప్రముఖ క్రీడా వ్యాఖ్యాత జస్ దేవ్ సింగ్ కన్నుమూత

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ క్రీడా వ్యాఖ్యాత జస్‌దేవ్‌ సింగ్‌ మంగళవారం కన్నుమూసినట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా ఆనారోగ్యం తో బాధపడుతున్న ఆయన తుది శ్వాసవిడిచినట్లు తెలుస్తుంది. 1955లో ఆల్‌ ఇండియా రేడియోతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన జస్ దేవ్ 1970, 80ల్లో దూరదర్శన్‌లో విశ్లేషకుడిగా రాణించాడు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న అతడు తుది శ్వాస విడిచారు. అతని మృతికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాఠోడ్‌ సంతాపం వ్యక్తం చేశారు. జస్‌దేవ్‌ 1985లో పద్మశ్రీ, 2008లో పద్మ భూషణ్‌ అందుకున్నాడు.