ఐరాస లో మాట్లాడిన ట్రంప్….నవ్వుకున్న సభ్యులు

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన చర్యలతో దాదాపు ప్రపంచ దేశాలలో ఆయన గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన తీసుకొనే నిర్ణయాలతో ఒకపక్క మండిపడుతున్న కొన్ని దేశాలు ఆయన మాటలకు నవ్వుకుంటున్నాయి అన్నది కూడా సత్యమే. సరిగ్గా ఐరాస లో కూడా ట్రంప్ కి ఇదే అనుభవం ఎదురైంది. ట్రంప్ ఐక్యరాజ్య సమితి లో మాట్లాడుతుంటే ఆ సమయంలో సభలోని సభ్యులు నవ్వారు. దీనితో ఆయనకు ఐరాస లో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఐరాస సమావేశంలో ఆయన మాట్లాడుతున్న సమయంలో సభలోని సభ్యులు నవ్వారు. ట్రంప్‌ అమెరికా సార్వభౌమత్వం, ఆయన రెండేళ్ల పాలనలో దేశం సాధించిన పురోభివృద్ధి గురించి మాట్లాడుతున్న సమయంలో కొందరు సభ్యులు నవ్వుతూ కనిపించారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి అమెరికా చరిత్రలో ఎన్నడూ జరగలేదంటూ ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఏడాది క్రితం ఈ సభలో నేను తొలిసారి మీ ముందు నిల్చున్నాను. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, మెరుగైన భవిష్యత్తు గురించి మాట్లాడాను’ అని ట్రంప్ అన్నారు. అయితే అప్పుడు ట్రంప్‌ పలుమార్లు అమెరికా అంతర్గత పాలసీల పట్ల ప్రపంచం నవ్వుకుంటోందని అన్నారు. కాగా ఇప్పుడు అమెరికా సాధించిన అద్భుతమైన పురోగతి గురించి మీతో పంచుకోవడానికి మీ ముందు ఉన్నానని ట్రంప్‌ వెల్లడించారు. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో తాము సాధించిన అభివృద్ధి అమెరికా చరిత్రలో ఏ యంత్రాంగం సాధించలేదని అన్నారు. కాగా ఆ సమయంలో సభలోని వారు నవ్వడంతో.. అంతరాయం కలగడంపై ట్రంప్‌ చిన్నగా నవ్వి తర్వాత దానిపై స్పందించారు. ఇలాంటి స్పందన తాను ఊహించలేదని, కానీ ఓకే అని అన్నారు.