బుర్కినాఫాసో లో అపహరణకు గురైన భారత్ కు చెందిన వ్యక్తి

వాస్తవం ప్రతినిధి: బుర్కినాఫాసోలో భారత్‌కు చెందిన ఓ గని కార్మికుడిని ఉగ్రవాదులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు అపహరించినట్లు తెలుస్తుంది. ఈమేరకు సాయుధులైన గుర్తుతెలియని వ్యక్తులు భారత్ కు చెందిన వ్యక్తి తో పాటు మరో ఇద్దరు కార్మికులను అపహరించినట్లు అక్కడి భద్రతా అధికారి ఒకరు తెలిపారు. మిగతా ఇద్దరు కార్మికుల్లో ఒకరు బుర్కినాఫోసోకు, మరొకరు దక్షిణాఫ్రికాకు చెందినవారుగా  అధికారులు వెల్లడించారు. దేశ ఉత్తరాన ఉన్న ఇనాటా బంగారు గనికి, డిజిబో పట్టణానికి మధ్యప్రాంతంలో కార్మికులను దుండగులు అపహరించినట్లు అధికారులు తెలిపారు.