ధోనీ వద్దే న్యాయకత్వ లక్షణాలు నేర్చుకున్నా: విరాట్ కోహ్లీ

వాస్తవం ప్రతినిధి: మహేంద్రసింగ్‌ ధోనీ.. కెప్టెన్సీకి పెట్టింది పేరు. అయితే విరాట్ కోహ్లీ కూల్ కెప్టెన్ కాకపోయినప్పటికీ ధోనీ నుంచి న్యాయకత్వ లక్షణాలు నేర్చుకున్నానని టీమిండియా సారధి విరాట్ కోహ్లీ తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆందోళన చెందకుండా జట్టును ఎలా ముందుకు నడిపించాలి అనే విషయంలో ధోనీ కి ఆయనే సాటి. అయితే అలాంటి ఆ కూల్‌ కెప్టెన్‌ నుంచే తాను నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నానని చెబుతున్నారు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ. ‘కేవలం మహేంద్రసింగ్‌ ధోనీ నుంచే నేను నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నా. ధోనీతో ఎప్పుడూ నేను ఆట గురించే మాట్లాడతా. నేను వైస్‌కెప్టెన్‌గా కాకముందే ఆయనతో నా సలహాలు, సూచనలు పంచుకునేవాడిని. ధోనీ నుంచి ఎంతో నేర్చుకున్నా. స్లిప్‌లో చాలా సార్లు ధోనీకి దగ్గరగా నిల్చుని ఆయన ఆటతీరును నిశితంగా పరీక్షించేవాడిని’ అని కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు ఆట గురించి ఆలోచించడం అంటే చాలా ఇష్టం. అందుకే కెప్టెన్సీని నేను ఎంతగానో ఆనందిస్తున్నా. ఆటలో నేను ఛేదననే ఇష్టపడుతుంటా. గేమ్‌ జరుగుతున్నంతసేపు నా మెదడుకు పనిపెడుతూనే ఉంటా’ అని కోహ్లీ చెప్పుకొచ్చారు.