మూడో బిడ్డకు జన్మనిచ్చిన రంభ !

వాస్తవం సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ మూడో బిడ్డకు జన్మినిచ్చింది. రంభ తన మొదటి ఇద్దరు పిల్లలకు టొరంటోలో జన్మనిచ్చింది. మొదటి సంతానం లాన్యకు 8 సంవత్సరాలు కాగా – రెండవ సంతానం సాషకు 4 సంవత్సరాలు. తాజాగా సెప్టెంబర్ 23న టొరంటో స్థానిక సమయం ప్రకారం రాత్రి సమయంలో రంభ బాబుకు జన్మనిచ్చినట్లుగా ఇంద్ర కుమార్ పోస్ట్ చేశాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. తన భార్య రంభ తమ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ను తీసుకు వచ్చింది ఇది చాలా సంతోషకరమైన సమయం అంటూ ఇద్రకుమార్ పోస్ట్ చేశాడు.