“బాలయ్య ఫ్యాన్స్” కి… “గుడ్ న్యూస్”..!!!

వాస్తవం సినిమా:  నందమూరి అందగాడు బాలకృష్ణ  సినిమా అంటే అభిమానులకి పండగే..అందులోనూ బోయపాటి తో కలిసి బాలయ్య సినిమా అంటే అబ్బో అసలు చెప్పుకోవలసిన పనే లేదు అభిమానులకి అన్ని పండుగలు కలిసి ఒకే సారి వచ్చినట్టే..బాలయ్య కి సరైన హిట్ లేక వెనకపడి ఉన్న సమయంలో బోయపాటి బాలయ్యతో తీసింది సింహా బాక్సాఫీస్ ని షేక్ చేసింది అంతేకాదు..ఆ సినిమాతో బాలయ్య రికార్డులు తిరగరాశాడు..అయితే

 

అక్కడితే వారి ఇద్దరి కాంబో ఆగలేదు మళ్ళీ లెజెండ్ తీసి బాలయ్య బాబు అభిమానులకి మరొక బిగ్గెస్ట్ హిట్ గిఫ్ట్ ఇచ్చాడు అయితే  ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో మరొక సినిమా రాబోతోంది..అసలు బాలయ్య 100 వ సినిమాని బోయపాటి డైరెక్ట్ చేయాల్సి ఉంది అయితే ఆ అవకాశం క్రిష్ కొట్టేశాడు.. ఆ తర్వాత బోయపాటి చెర్రీ తో తీయబోయే సినిమాలో బిజీ బిజీ అయిపోయాడు అయితే టాలీవుడ్ లో బోయాపాటి బాలయ్య ల కాంబో లో మరో సూపర్ డూపర్ చిత్ర రాబోతోందనే వార్తా హల్చల్ చేస్తోంది.

చెర్రీ తో బోయపాటి సినిమా అవ్వగానే త్వరలోనే బాలయ్య తో భారీ బడ్జెట్ అంటే దాదాపు 70 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు…బాలకృష్ణ కెరియర్ లో ఇప్పటి వరకూ ఇంత భారీ బడ్జెట్ మూవీగా ఇప్పటి వరకూ చేయలేదు దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి అంతేకాదు ఈ సినిమాని 70 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట…త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుందట.