బాలీవుడ్ లోకి’ ఆర్ ఎక్స్ 100′ .. హీరో ఫిక్స్..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ లో ఇటీవలే వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా ఆర్ఎక్స్ 100. చిన్న సినిమాగా వచ్చి.. పెద్ద విజయం సాధించింది. నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. కాగా, ఈ సినిమాను ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో ఈ సినిమా ఆది పినిశెట్టి హీరోగా రీమేక్ అవుతోంది. ఇక హిందీలోను ఈ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సాజిద్ నడియాడ్ వాలా చేతికి హిందీ రీమేక్ రైట్స్ వెళ్లాయి. సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి కథానాయకుడిగా ఈ సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. హిందీలోనూ ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందనీ .. ఆహాన్ శెట్టి కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని సునీల్ శెట్టి భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.