దోషులుగా తేలకపోతే వారిపై అనర్హత వేటు వేయలేము: సుప్రీం కోర్టు

వాస్తవం ప్రతినిధి: ఎంపీ,ఎమ్మెల్యే లపై క్రిమినల్ కేసులు నమోదైతే చట్ట సభ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని సుప్రీం కోర్టు లో పిటీషన్ దాఖలు అయ్యింది. అయితే ఆ పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు చట్టసభ సభ్యులు దోషులుగా తేలక ముందే వారిపై అనర్హత వేటు వేయలేమని వెల్లడించింది. కేవలం అభియోగాలు నమోదైతే వారిపై అనర్హత వేటు వేయలేమని.. అయితే వారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చో లేదో అన్న విషయాన్ని పార్లమెంట్‌కే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఒక క్రిమినల్‌ కేసులో దోషిగా తేలాకే చట్టసభ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే అభియోగాల నమోదు దశ నుంచే ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు భాజపా నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌లు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం నేడు తీర్పు వెలువరిచింది.