చింతమనేని ఓ రౌడీ..కంట్రోల్ లో పెట్టండి..బాబు కి పవన్ వార్నింగ్

వాస్తవం ప్రతినిధి:   పశ్చిమలో మలివిడత పర్యటనకి జనసేనాని సర్వం సిద్దం అయ్యాడు..దాదాపు పదిరోజులకి పైగానే ఈ యాత్ర పశ్చిమగోదావరి మెట్ట ప్రాంతంలో కొనసాగుతుంది..ఏలూరు , దెందులూరు , జంగారెడ్డిగూడెం ,చింతలపూడి, ఉంగుటూరు,పోలవరం , ముపుమండలాలు ఇలా మొత్తం పదిరోజుల పాటు పవన కవర్ చేయనున్నారట. అంతేకాదు నియోజకవర్గాల వారీగా ఆయా ప్రాంతాలలో సమస్యలపై పవన్ దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలపై పెద్ద ఫైల్ నే సిద్దం చేశారట పార్టీ నేతలు.

ఇదిలాఉంటే కొన్ని రోజుల క్రితం దెందులూరు లో ఒక దళిత కార్మికుడిపై జరిగిన దాడి విషయంలో ప్రజా సంఘాలు వామపక్షాలు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు జరిపిన విషయం అందరికి తెలిసిందే అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించారు మీడియా సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు కి చింతమనేని ప్రభాకర్ కి వార్నింగ్ కూడా ఇచ్చారు..ప్రభుత్వానికి గతంలో నేను మద్దతు ఇచ్చింది కేలవం చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అని అయితే అలాంటి చంద్రబాబు దృష్టికి చింతమనేని వ్యవహారం ఎన్నో సార్లు తీసుకుని వెళ్లాను అయితే

చింతమనేని ఆగడాలకి ఇప్పటి వరకూ బ్రేకులు వేయలేకపోయారు..ఒక రౌడీ పశ్చిమ గోదావరి దెందులూరు లో రాజ్యమేలుతూ ఉంటే చంద్రబాబు ఎందుకు పట్టించుకోరు..ఇన్ని కేసులు ఒక ఎమ్మెల్యే పై ఉంటే అతనిపై రౌడీ షీట్ పెట్టాలి కదా ప్రభుత్వాలు ప్రజలకోసమే కదా ఉండేది దళిత తేజం అంటూ మీటింగ్ లు పెట్టి ఒట్లకి గేలం వేయడం మానండి చింతమనేని పై తక్షణమే చర్యలు తీసుకోండి లేదంటే ప్రజలే చింతమనేనికి బుద్ది  చెప్తారు అంటూ బాబు కి హెచ్చరికలు జారీ చేశారు  పవన్ కళ్యాణ్..అంతేకాదు

దెందులూరు రేపటి మీటింగ్ లో మాట్లాడుతా అక్కడి వచ్చి మాట్లాడుతా అంటూ పవన్ ఫైర్ అయ్యారు..చంద్రబాబు హయాంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందని అధికార దుర్వినియోగం జరుగుతోందని వీటన్నిటిని జనసేన చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు..మీరు చింతమనేనిని కంట్రోల్ చేస్తారా లేదా ప్రజలు కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకువస్తారా ఆసమయంలో లా అండ్ ఆర్డర్ తీసుకువచ్చినా లాభం లేదు అంటూ సుతిమెత్తగా బాబు కి వారింగ్ ఇచ్చారు జనసేనాని .