విశ్వాస పరీక్ష లో ఓటమి చవిచూసిన స్వీడన్ ప్రధాని  

వాస్తవం ప్రతినిధి: విశ్వాస పరీక్షలో స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోవెన్ ఓటమి చవిచూసినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 9వ తేదీన జరిగిన జనరల్ ఎలక్షన్‌లో హంగ్ పార్లమెంట్ ఏర్పడిన సంగతి తెలిసిందే. స్టీఫెన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ప్రధానిగా ఆయన ఆ హోదాలో ఎక్కువ కాలం ఉండలేకపోవడం తో ఆయనపై విశ్వాస పరీక్ష నిర్వహించారు. అయితే ఈ విశ్వాస పరీక్ష కోసం జరిగిన ఓటింగ్‌లో స్టీఫెన్‌కు వ్యతిరేకంగా 204 మంది, అనుకూలంగా 142 మంది ఓటేశారు. ప్రధాని స్టీఫెన్ స్థానంలో ఇప్పుడు స్పీకర్ కొత్త నేతను ఎన్నుకోనున్నారు. కొత్త ప్రధాని ఎన్నిక జరిగే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా లోవెన్ కొనసాగనున్నారు. స్వీడన్ దేశంలో విశ్వస పరీక్షలో ఓడిన మొదటి ప్రధానిగా స్టీఫెన్ నిలిచారు. సెంటర్ లెఫ్ట్‌కు చెందిన స్టీఫెన్ కూటమి.. తాజా ఎన్నికల్లో సెంటర్ రైట్ కంటే ఒకే ఒక్క సీటును ఎక్కువగా గెలుచుకున్నది.