ఇరాన్ లో తొమ్మిది మందికి బహిరంగ ఉరి శిక్ష

వాస్తవం ప్రతినిధి: ఇరాన్ లో ఉరిశిక్షలు అమలు చేయొద్దు అంటూ ఒకపక్క మానవ హక్కుల సంఘాలు ఎంత ఒత్తిడి తీసుకోస్తున్నప్పటికి ఇరాన్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ నేపధ్యంలో తొమ్మిది మంది కి బహిరంగంగా ఉరి శిక్ష అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఓ మహిళపై దారుణ లైంగికదాడి కేసులో ఇరాన్ బహిరంగంగా తొమ్మిదిమందికి ఉరిశిక్ష అమలు చేసింది. ఫర్స్ ప్రావిన్సులో ఓ విల్లాలో నివసిస్తున్న మహిళ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన దుండగులు ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు వారికి మరణశిక్ష విధించింది.