మరోసారి రిఫరెండం నిర్వహించడం కన్నా,పార్లమెంట్ ని రద్దు చేయడం మంచిది!

వాస్తవం ప్రతినిధి: బ్రేగ్జిట్ పై మరోసారి రిఫరెండం నిర్వహించడం కన్నా,పార్లమెంట్ ను రద్దు చేయడం మంచిదని లేబర్ పార్టీ నాయకుడు జాన్ మెక్ డానెల్ అభిప్రాయపడ్డారు. కొంతమంది పిలుపునిస్తున్నట్లు బ్రెగ్జిట్‌పై మరోసారి రిఫరెండం నిర్వహించటం కన్నా, పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లటమే మేలని ఆయన వ్యాఖ్యానించారు. బ్రెగ్జిట్‌పై ప్రస్తుతం కొనసాగుతున్నచర్చల్లో ఇయు నేతలతో అవగాహనకు రావటంపై మే ప్రభుత్వం ఊగిసలాడుతున్న నేపథ్యంలో డానెల్‌ ఈ సూచన చేయడం విశేషం. బ్రెగ్జిట్‌ విషయంలో బ్రిటన్‌ ప్రభుత్వం ఇయుతో ఒప్పందం కుదుర్చుకోలేనపుడు ఎన్నికలకు వెళ్లటమే మంచిదని ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు. ‘పీపుల్స్‌ ఓట్‌’ ప్రచార కర్తలు పిలుపునిస్తున్న మరో రిఫరెండం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆయన ప్రధానికి సూచించినట్లు తెలుస్తుంది.