షోయబ్ ని బావ అని పిలిచిన భారత క్రికెట్ అభిమానులు

వాస్తవం ప్రతినిధి: దుబాయ్‌ వేదికగా ఆసియాకప్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరిగిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మళ్లీ టీమిండియా విజయఢంకా మోగించింది. అయితే మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో మైదానంలోకి పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌‌ మాలిక్‌ రాగానే అక్కడ ఉన్న భారత క్రికెట్ అభిమానులు షోయబ్ జీజూ(బావ) అంటూ ఒక్కసారిగా కేకలు వేశారు. షోయబ్‌‌ ప్రముఖ భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ అభిమానులు బావ అంటూ కేకలు వేయడం తో షోయబ్ వెనక్కి తిరిగి వారికి హాయ్ చెప్పారు.  అయితే అభిమానులు ‘బావ’ అంటూ కేకలు వేస్తున్నప్పుడు తీసిన వీడియోను అభిమానులు ట్విటర్‌లో షేర్‌ చేయడం తో ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌ను అలవోకగా ఓడించిన భారత్‌.. సూపర్‌-4లో ఆ జట్టు పని పట్టింది. ఆదివారం 9 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసింది.