ఈ గెటప్ లో అక్షయ్ ను చూస్తే భయపడటం ఖాయం

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ దర్శకుడు శంకర్ డ్రీం ప్రాజెక్ట్ రోబో 2 .0. సూపర్ స్టార్  రజిని కాంత్  ప్రముఖ కథా నాయకుడుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. మొదటిసారి అక్షయ్ కుమార్ విలన్ గా ఓ భారీ సైంటిఫిక్ యాక్షన్ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం సెల్ ఫోన్స్ తో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో.. వాటి వలన పక్షులకు వచ్చే ఇబ్బందులను ఇందులో చూపించబోతున్నారు. ఒక నల్లటి కాకిలా అక్షయ్ కనిపించబోతున్నాడు.

ఒక మంచి పనికోసం అక్షయ్ ఇలా మారడం.. తరువాత కొన్ని దుష్ట శక్తుల ప్రభావంతో అక్షయ్ మంచి నుంచి చెడుగా మారిపోవడం.. వినాశం సృష్టించాలని భావించడంతో.. దానికి ఎదుర్కొనడానికి రోబో ది చిట్టి మరలా వస్తుంది. టూకీగా కథ ఇదే అనుకోవచ్చు. బ్యాట్ మెన్ యాక్షన్ సీన్స్ లాంటి సీన్స్ ఇందులో కనిపించబోతున్నాయని సమాచారం. విలన్ రోల్ ను అక్షయ్ పర్ఫెక్ట్ గా చేశారని, అక్షయ్ ను చూస్తే భయపడటం ఖాయమని అంటున్నారు.