‘దేవదాస్’ ట్రైలర్ స్పీడ్ మామూలుగా లేదండోయ్..

వాస్తవం సినిమా: నాని-నాగార్జున కలిసి నటించిన ‘దేవదాస్’ మూవీ ఈ నెల 27న విడుదలువుతున్న సంగతి తెలిసిందే.. ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్‌కు, సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. దేవ‌దాస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సినిమా ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను కట్ చేశారు.లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్లోనే బోలెడంత ఫన్ నిండి ఉండటంతో ప్రేక్షకులు సినిమాలో ఇంకెంత ఫన్ ఉంటుందో అనుకుంటున్నారు. నాగ్, నానీలు కొత్తగా కనిపించడమేగాక వారి నటనలో కూడ కొంత భిన్నత్వం కనిపించేలా ఉంది ట్రైలర్.

ఇప్పటి వరకు ఈ ట్రైలర్ కు నాలుగు మిలియన్ల వ్యూస్ దక్కగా ఇంకో రెండు రోజుల్లో ఈ మొత్తం 5 మిలియన్లకు చేరే అవకాశాలున్నాయి. ఈ నెల 27వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రాన్ని సరేరామ్ ఆదిత్య డైరెక్ట్ చేశాడు. ఇందులో నాని సరసన రష్మిక నటించగా నాగార్జునకు జోడీగాఆకాంక్ష సింగ్ నటించింది. ఈ సినిమాలో డాన్ గా నాగార్జున .. డాక్టర్ గా నాని కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.