మహిళా దర్శక నిర్మాత కల్పనా లజ్మి కన్నుమూత

వాస్తవం సినిమా: మహిళా దర్శక నిర్మాత కల్పనా లజ్మి (64) కన్ను మూశారు. గత ఏడాదిగా కిడ్నీ క్యాన్సర్ తో బాధపడుతున్న ఈమె ఆదివారం తెల్లవారు జామున నాలుగున్నర గంటల ప్రాంతంలో మృతి చెందారని యాక్టర్ హ్యూమా ఖురేషీ ట్వీట్ చేశారు. రుడాలీ, చింగారీ, ఏక్ పల్, దామన్ వంటి వుమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కల్పన దర్శకత్వం వహించారు. ఈమె చివరిసారి 2006‌లో చింగారీ మూవీకి దర్శకత్వం వహించారు. 66‌వ అకాడమీ అవార్డుల ఉత్సవంలో ఉత్తమ విదేశీ భాషా చిత్రాల కేటగిరీలో ‘రుడాలీ ’చిత్రం ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది. మూడు దశాబ్దాల క్రితం శ్యాం బెనెగల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టరుగా కెరీర్ ప్రారంభించిన కల్పనా రజ్మి ఆ తరువాత దర్శకురాలిగా ఎదిగారు. ఆమె మృతికి బాలీవుడ్ తీవ్ర సంతాపం ప్రకటించింది.