భద్రతా బలగాలు,ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు….ఇద్దరు ఉగ్రవాదులు హతం!

వాస్తవం ప్రతినిధి: జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా తంగ్‌దర్ సెక్టార్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నిన్న మధ్యాహ్నం తంగ్‌దర్ సెక్టార్ వద్ద ఐదుగురు ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నారని బలగాలకు సమాచారం అందడంతో అక్కడ కూంబింగ్ నిర్వహించాయి. ఈ నేపధ్యంలో నిన్న చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతం చేయగా… ఇవాళ ముగ్గురిని మట్టుబెట్టినట్లు తెలుస్తుంది.