“జనసేన” కు సొషల్ మీడియాలో వెన్నుపోటు కుట్ర

వాస్తవం ప్రతినిధి: పవన్ పార్టీ జనసేనపై భారీ కుట్ర జరగనుందా..? పార్టీ పరువుని రోడ్డుకి ఈడ్చడానికి తెరవెనుక కుట్రలు జరుగుతున్నాయా..? పార్టీపై అభాండాలు మోపడానికి ఇప్పటికే వ్యుహరచనలు జరిగాయా..? అంటే అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు. ఇప్పటికే ఈ విషయంపై జనసేన పార్టీకి కీలక సమాచారం ఉందని తెలుస్తోంది దాంతో జనసేన పార్టీ కార్యకర్తలకి, పవన్ అభిమానులకి పార్టీ నాయకులకి కీలక ఆదేశాలు వెళ్ళాయట దాంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని పార్టీ నుంచీ కొన్ని సూచనలు వెళ్ళాయి…అయితే అసలు పవన్ పార్టీ పై కుట్రకి తెరతీస్తోంది ఎవరు..? ప్రజారాజ్యం పై జరిపిన కుట్రలే ఇప్పుడు జరుపబోతున్నారా..? అనే వివరాలలోకి వెళ్తే..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో తన పార్టీని బలోపేతం చేయడానికి ఒక్కో రాయి పేర్చుకుంటూ జనసేన గూడు ఎంతో బలంగా తీర్చి దిద్దుకుంటున్నారు..ఈ క్రమంలోనే జిల్లాల వారీగా యాత్రలు చేపడుతూ పార్టీలోకి బలమైన వ్యక్తులని ,ప్రజా సంఘాల నాయకులని రైతు ఉద్యమ కారులని ఆహ్వానిస్తూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు అయితే ఏపీలో మారుతున్న రాజకీయ దృష్ట్యా ప్రధాన పార్టీలుగా చెలామణి అవుతున్న తెలుగు దేశం వైసీపీలకి ప్రత్యామ్నాయంగా పవన్ మారుతున్నాడు అయితే

ఎలాగైనా పవన్ ఎదుగుదలకి అడ్డుకట్ట వేయాలని అనుకుంటున్న ప్రధాన అధికార పార్టీ టీడీపీ జనసేనని దెబ్బకొట్టడానికి వ్యుహరచనలు చేయడం మొదలుపెట్టిందట..ప్రజా రాజ్యం సమయంలో పరకాల ప్రభాకర్ చిరంజీవి పై ఒక్క సారిగా విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిని చిరు మీదనుంచీ డైవెర్ట్ చేస్తూ వెన్నుపోటు పొడుస్తూ టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు అయితే అప్పట్లో పరకాల వెనుకాల టీడీపీ పార్టీ ఉందనేది అందరికి తెలిసిన విషయమే అయితే

పవన్ కళ్యాణ్ పై పార్టీ పై ఇదే పద్దతిలోనే దాడి చేయాలనేది వ్యూహంగా తెలుస్తోంది.. ఈ సారి తనకి ఎంతో బలమైన ఫ్యాన్స్ ని అడ్డుపెట్టుకుని పవన్ ని దెబ్బకొట్టాలనేది అసలు వ్యూహంగా తెలుస్తోంది…ఈ విషయంపైనే తాజాగా టీడీపీ ఐటీ విభాగంలో ఒక కీలకమైన మీటింగ్ పెట్టిందట. దాంట్లో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ పేరుపై నకిలీ పేస్ బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అందులో నమ్మకమైన ఫ్యాన్స్ గా ఉంటూ కొంతకాలం అయిన తరువాత అంటే ఎన్నికల ముందు జనసేన పార్టీపై విమర్శలు చేస్తూ, జనసేనలో న్యాయం లేదని అంటూ పవన్ అభిమానులుగా పార్టీ పరువు తీస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేయాలనేది వ్యూహంగా తెలుస్తోందట మరి ఈ చర్యలని జనసేన వర్గాలు ఎలా తిప్పికొడతాయో వేచి చూడాల్సిందే.