స్వర్ణాల ఘాట్ లో గెలుపు రొట్టెను పట్టుకొన్న పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బారాషహీద్ దర్గాలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ వెంట ప్రముఖ హాస్యనటుడు అలీ కూడా ఉన్నారు. దర్గాలో పూజలు నిర్వహించిన అనంతరం స్వర్ణాల ఘాట్ లో రొట్టెను పవన్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని , 2019 ఎమ్మికల్లో విజయం సాధించాలని స్వర్ణాల చెరువులో గెలుపు రొట్టెను పట్టుకొన్నారు. కాగా, పవన్ ను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.ఆయనతో కలిసి సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.