జైట్లీ .. అబద్దాలు ఆపండి : రాహుల్

వాస్తవం ప్రతినిధి: రాఫెల్ విషయంలో అబద్దాలు చెప్పడాన్ని ఆపాలని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎటువంటి స్కాం జరగలేదన్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఖండించారు. జైట్లీ వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాఫెల్ విషయంలో అబద్ధాలు చెప్పడం మానుకోవాలని సూచించారు.’ 2 నిజాలు లేదా అసత్యాలను తిప్పి చెప్పడంలో జైట్లీ సమర్ధుడు. సమర్ధించుకోవడానికి వీల్లేని విషయాలను కూడా సమర్ధించుకోగలరు. ఇక చాలు. ఇప్పటికైనా జైట్లీ రక్షణ మంత్రి, ప్రధాని అబద్దాలు చెప్పడం మానుకొని సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని నియమించాలి’ ట్వీట్ చేశారు.
ఈ వ్యవహారంపై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన వార్తా కథనాలను కూడా ట్వీట్‌తో జత చేశారు. రాఫెల్‌ భాగస్వామిగా అనిల్‌ అంబానీ కంపెనీని భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందని హోలన్‌ చేసిన ప్రకటన నిజం కాదని అంతకుముందు జైట్లీ తెలిపారు. దానికి రాహుల్ పై విధంగా ట్వీట్టర్ ద్వారా స్పందించారు.