హత్యాకాండపై ఆవేదన వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్‌

వాస్తవం ప్రతినిధి: విశాఖ ఏజెన్సీలో ఇద్దరు ప్రజాప్రతినిధులను మావోయిస్టుల హత్య చేసిన ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు కావడం షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన కలచివేసింది. ఆ ఇద్దరు నేతల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు. 2009-2014 మధ్య కాలంలో సివేరి సోమ, తాను అసెంబ్లీలో సహచరులమని కేటీఆర్‌ గుర్తుచేసుకున్నారు.‌