రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదం లో మృత్యుంజయుడి గా బయటపడ్డ వ్యక్తి

వాస్తవం ప్రతినిధి: రెండు రోజుల క్రితం టాంజానియా లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది మృత్యువాత పడ్డారు. అయితే రెండు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదం నుంచి ఒక వ్యక్తి సజీవుడిగా బతికి బయటపడిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. బోటు మునిగిపోయిన ప్రదేశంలో మృతదేహాల కోసం గాలిస్తున్న సహాయక బృందాలకు బోటులో చిక్కుకుపోయిన ఒక వ్యక్తి కన్పించటంతో అతడిని తీరానికి చేర్చినట్లు అధికారులు చెప్పారు. ఈ వ్యక్తిని మునిగిపోయిన బోటు ఇంజన్‌ వద్ద తాము కనుగొన్నట్లు మ్వాంజా రీజినల్‌ కమిషనర్‌ జాన్‌ మాంగెల్లా మీడియాకు చెప్పారు. ఇతడు ఒక ఇంజనీర్‌ అని ఆయన వివరించారు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు.