అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ హాస్య నటుడు, అన్నా డీఎంకే ఎమ్మెల్యే, శశికళ వర్గం నేత కరుణాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇటీవల జరిగిన ఒక ధర్నా లో పాల్గొన్న కరుణాస్ తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామీ,పలు వార్తా సంస్థలు,రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్ట్ చేశారు.   ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో క్షమాపణలు సైతం చెప్పిన ఆయన అనంతరం కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేయక తప్పలేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న కురుణాస్‌ను అరెస్ట చేశామని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. అయితే తన అరెస్టుపై న్యాయపరంగా వెళ్తానని కరుణాస్‌ తెలిపారు. ఇదిలాఉండగా కరుణాస్‌ 2016లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే టికెట్‌పై తిరవదనై నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.