బ్రిగ్జిట్ పై రాజకీయ డ్రామాలాడడం మానుకోవాలి!

వాస్తవం ప్రతినిధి: బ్రెగ్జిట్‌పై రాజకీయ డ్రామాలాడడం మానుకోవాలంటూ ప్రధాని థెరిస్సా మే, మరియు ఈయు నేతలను లేబర్‌ పార్టీ నాయకుడు జెరిమీ కార్బిన్‌  హెచ్చరించారు. అంతేకాకుండా ఆస్ట్రియాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఇయు నేతలందరూ థెరిస్సా మేను అవమానించారని పేర్కొంటూ ఆమెను అసమర్ధ ప్రధానిగా ముద్ర వేశారు. పౌరుల ప్రయోజనాలకు ముప్పు కలిగించే రీతిలో అటు థెరిస్సా, ఇటు ఇయు ఇరు పక్షాలు కూడా బ్రెగ్జిట్‌తో ఆటలాడొద్దని సూచించారు. సాల్జ్‌బర్గ్‌ సమావేశం నుండి తిరిగి వచ్చిన వెంటనే థెరిస్సా ఒక ప్రకటన చేస్తూ, ఇయు నేతలు బ్రిటన్‌ పట్ల గౌరవంతో వ్యవహరించాలని కోరిన సంగతి తెలిసిందే.