చైనా చర్యలకు పాల్పడితే మరిన్ని సుంకాలు విధిస్తాం: ట్రంప్

వాస్తవం ప్రతినిధి: అమెరికా తీసుకుంటున్న చర్యలకు ప్రతిగా తాము కూడా చర్యలకు దిగుతామని చైనా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందిస్తూ మేము తీసుకుంటున్న చర్యలకు ప్రతిగా చైనా చర్యలకు దిగినట్లయితే చైనా ఉత్పత్తులపై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించారు. దాదాపు 2వేల కోట్ల విలువైన చైనా ఎగుమతులను లక్ష్యంగా చేసుకుని తాజాగా విధించిన టారిఫ్‌లపై చైనా స్పందిస్తే పై పర్యవసానాలు తప్పవని పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధానికి దిగేముందు చైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని, అమెరికా వద్ద మరిన్ని బుల్లెట్లు వున్నాయని ట్రంప్‌ అన్నారు.