తలపడనున్న బంగ్లా-ఆఫ్ఘన్ జట్లు  

వాస్తవం ప్రతినిధి: ఆసియా కప్‌ సూపర్‌-4 దశను ఓటములతో ఆరంభించిన బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ లు ఇప్పుడు పోరు కు సిద్దమయ్యాయి. బంగ్లా భారత్‌ చేతిలో చిత్తయితే.. పాకిస్థాన్‌ చేతిలో అఫ్గాన్‌ త్రుటిలో ఓడింది. ఈ రెండు జట్లూ ఇంకో మ్యాచ్‌ ఓడితే దాదాపుగా ఫైనల్‌ రేసుకు దూరమవుతాయి. ఈ స్థితిలో రెండు జట్లూ ఆదివారం తలపడనున్నాయి. భారత్‌-పాక్‌ పోరు సమయంలోనే ఈ మ్యాచ్‌ కూడా జరుగనుండం విశేషం. రెండూ సమవుజ్జీలుగా కనిపిస్తుండటంతో మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశముంది. మరి ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌ అవకాశాల్ని సజీవంగా ఉంచుకునే జట్టేదో అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.