బ్రేకింగ్ – త్వరలో చిరంజీవి బయోపిక్

వాస్తవం సినిమా: బయోపిక్ ఇప్పుడు టాలీవుడ్ ,బాలీవుడ్ ,కోలీవుడ్ అన్నిటిలో ఈ పేరు మారు మోగుతోంది..టాలీవుడ్ అయితే ఈ బయోపిక్ ల సందడి అంతా ఇంతా…భవిష్యత్తులో బయోపిక్ లకి మంచి ఘిరాకీ ఉండేటట్టుగా ఉంది.. ప్రముఖుల జీవితాల లోలోతుల దాగిన జీవిత సత్యాలు వారు ఎదిగే క్రమం..పడిన కష్టాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు వారి జీవితం మొత్తం వారి అభిమానులకి బయోపిక్ రూపంలో చూపించడం అంటే మామూలు విషయం కాదు..

అయితే మహానటి పేరుతో విడుదలయిన అలనాటి నటి సావిత్రి బయోపిక్ ఎంతటి ఆదరణ పొందిందో వేరే చెప్పనవసరం లేదు ఆ బయోపిక్ ఒక సంచలనమే అయ్యింది..నాగ్ అశ్విన్ అనే దర్శకుడు సావిత్ర గారిపై ఉన్న అభిమానంతో తీసిన మహానటి ఎన్ని రికార్డులు సృష్టించిదో అందరికీ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పొతే క్రికెట్ దిగ్గజం మాజీ టీమిండియా కెప్టెన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బియోపిక్ ధోనీ కూడ దేశ వ్యాప్తంగా ఒక సంచలనమే అయ్యింది..

ఈ క్రమంలో టాలీవుడ్ లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర  ఆధారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బయోపిక్ ఎన్టీఆర్ సైతం తెలుగు ప్రేక్షకులలో ఎంతో ఉత్కంటని రేపుతోంది..అలాగే వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న  యాత్ర..జయలలిత..చంద్రబాబు ఇలా అందరి పేరుమీద బయోపిక్ లు సిద్దమవుతున్నాయి అయితే తాజాగా మరో బయోపిక్ న్యూస్ విషయం టాలీవుడ్ లో వైరల్ అవుతోంది అదేంటంటే..

మెగా అభిమానుల కోసం మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తెరకెక్కించనున్నారట..అంతేకాదు ఈ బయోపిక్ ని కొణేదళ ప్రొడక్షన్ లో నిర్మించేది చిరు తనయుడు చరణ్ నిర్మించానున్నారని టాక్ వినిపిస్తోంది..అయితే ఈ బయోపిక్ లో చిరంజీవి రాజకీయ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కున్నారు..ఎన్ని అవమానాలు పడ్డారు…ఒక సామాన్యుడి స్థాయి నుంచీ మెగా స్టార్ గా ఎలా ఎదిగారో చూపించ నున్నారట…అయితే ఈ బయోపిక్ కి దర్శకుడు ఎవరో అనేది ప్రస్తుతానికి సస్పన్స్ అనే అంటున్నారు.