ఆకట్టుకొంటున్న ‘నవాబ్’ ట్రైలర్

వాస్తవం సినిమా: క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా తెరకెక్కిస్తోన్న సినిమా ‘నవాబ్’. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా నిర్మిస్తోన్న ఈ సినిమాలో అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, జ్యోతిక, జయసుధ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

అరవింద్ స్వామి .. అరుణ్ విజయ్ .. శింబు .. విజయ్ సేతుపతి .. జ్యోతిక .. ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. నలుగురు కథానాయకులు కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ ట్రైలర్ కొనసాగింది. సహజత్వానికి దగ్గరగా మలచిన సన్నివేశాలు మనసుకు పట్టుకునేలా వున్నాయి.ఆర్ రహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కు సిద్ధమవుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.