నెల్లూరు లో పర్యటిస్తున్న జనసేన అధినేత

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా లో పర్యటిస్తున్నారు. తొలుత పోలీసులు అనుమతి నిరాకరించినా.. చివరకు షరతులుతో కూడిన అనుమతి లభించడం తో ఈనేప‌థ్యంలో మాగుంట లేవుట్‌లోని డిఎస్‌ఆర్‌ హోటల్‌కు చేరుకుని. అక్కడ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు.  అనంతరం మధ్యాహ్నం 12నుంచి 2 గంటల మధ్యలో బారాషాహిద్‌ దర్గా వద్దకు చేరుకుంటారు. అక్కడ మీడియాతో మాట్లాడి పశ్చిమగోదావరి జిల్లాకు బయలుదేరి వెళతారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దర్గాకు లక్షల సంఖ్యలో యాత్రికులు వస్తున్నందున ఆ సమయంలో ప్రముఖులు వస్తే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని, తొలుత పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ షరతుల తో కూడిన అనుమతి లభించడం తో పవన్ నెల్లూరు పర్యటన లో పాల్గొన్నారు. తాము చెప్పిన సమయంలోనూ దర్గా వద్దకు రావాలని, ఆ సమయంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, యాత్రికులను నియంత్రిస్తామని పోలీసులు తెలిపారు.